NTV Telugu Site icon

Gun Firing: సిద్దిపేటలో కాల్పుల కలకలం

భూ వివాదంలో హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే… మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా భూ వివాదానికి లింక్‌ అయ్యే ఉందని చెబుతున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి… తొగుట మండలం వెంకట్రావుపెట్ – జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతి – వంశీ అనే వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తుండగా… ఒగ్గు తిరుపతికి చెందిన వ్యక్తులు వంశీపై కాల్పులు జరిపినట్లు సమాచారం.. గతంలో వంశీకృష్ణ.. ఒగ్గు తిరుపతిపై కత్తితో దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. దీంతో ప్రతీకారంతో రగిలిపోతోన్న తిరుపతి.. వంశీపై కాల్పులు జరిపించినట్టుగా తెలుస్తోంది.. ఇక, సమాచారం అందుకున్న సీపీ శ్వేత.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, తెలంగాణలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Read Also: Movie Ticket Prices: సినీ ఇండస్ట్రీపై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు