NTV Telugu Site icon

Group 1 Mains Exam: ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు!

Group 1 Mains Exam

Group 1 Mains Exam

Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్షలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారుల అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్‌ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు జిల్లాల వ్యాప్తంగా 46 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రూప్‌ 1 అభ్యర్తులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించం అని హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. అయితే ముందు నుంచి అధికారులు నియమాలు పాటించాలని కోరుతున్న కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రూప్‌ 1 పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైన సమయంలో కొందరు విద్యార్థుల తీరు మాత్రం మారలేదు.

Read also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్‌ స్టెప్పులు..

పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమంతించలేదు.. కేంద్రాలకు గేట్లు వేసేశారు. ఒక్క నిమిషమే కదా.. లోనికి అనుమతించాలని కోరారు. మీకు అనుమతిస్తే సీసీ కెమెరాలు ఉంటాయి.. వాటి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని అధికారులు తెలిపారు. మీరు ఏడ్చినా, ఏం చేసిన లోనికి మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నియమాలు ఉంటాయని ముందునుంచి చెబుతున్నా.. దానిని ఉపయోగించకుండా ఇలా చేస్తే మీరే బాధపడాల్సి వస్తుందని సూచించారు. అయితే కోఠి, సికింద్రాబాద్, గంపేట, రంగారెడ్డి, గద్వాల్‌ జిల్లాలతో పాటు పలు పరీక్షలు కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళల చేశారు. అయినా అధికారులు లోనికి అనుమతించేంది లేదని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.


Mahesh Kumar Goud: విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోండి.. మేము అండగా ఉన్నాం..