Groom Harassed Bride For Dowry Before Marriage In Hyderabad: పెళ్లయ్యాక అధిక కట్నం కావాలంటూ.. తమ భార్యల్ని కిరాతక భర్తలు, అత్తమామలు వేధించే సంఘటనలు తరుచుగా వెలుగు చూస్తుంటాయి. కానీ.. ఇక్కడ పెళ్లికి ముందే వరటక్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే.. ఓ యువకుడు వరకట్న వేధింపులకి పాల్పడ్డాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన జరిగిందో మరెక్కడో కాదు.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో! ఆ వివరాల్లోకి వెళ్తే..
Tomato Price: రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!
నగరానికి చెందిన రోహిత్ డెవిడ్ పాల్ అనే యువకుడికి గతేడాది మార్చి 1వ తేదీన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుకను యువతి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఏకంగా రూ.10 లక్షలు వెచ్చించి, పెళ్లి వేడుక తరహాలోనే గ్రాండ్‌గా చేశారు. గతేడాది జులైలోనే పెళ్లి చేయాలని ఇరువురి కుటుంబీకులు నిర్ణయించారు. అయితే.. నిశ్చితార్థం జరిగిన తర్వాత రోహిత్‌తో పాటు అతని తల్లి వనిత తమ అసలు స్వరూపం బయటపెట్టారు. పెళ్లి గురించి మాట్లాడితే.. మాట దాటవేస్తూ వచ్చారు. అంతేకాదు.. రూ.2 కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే లేదంటూ రోహిత్ తెగేసి చెప్పాడు.
Chittoor Dairy: చిత్తూరు డెయిరీని అమూల్‌కు కట్టబెట్టొద్దు.. సీఎస్‌కు లేఖ
తమకు అంత స్థోమత లేదని, అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పినా.. అడిగినంత ఇస్తేనే పెళ్లికి రెడీ అంటూ రోహిత్, అతని తల్లి వనిత డిమాండ్ చేశారు. ఎంత బుజ్జగించినా వాళ్లు ఒప్పుకోకపోవడంతో, యువతి సహనం కోల్పోయింది. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. రోహిత్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థం వరకు మంచి వ్యక్తులుగా నటించి, ఆ తర్వాతి నుంచి వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రోహిత్ తల్లి అనిత డాక్టర్‌గా పని చేస్తుంది.