Site icon NTV Telugu

GRMB Meeting: జీఆర్‌ఎంబీ మీటింగ్‌ వాయిదా.. ఎందుకంటే?

Grmb

Grmb

గోదావరి నది యాజమాన్య బోర్డ్ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు గైర్హాజరు అయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బోర్డు సమావేశాలకు వరుసగా రెండు సార్లు డుమ్మా కొట్టారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. గత నెల మార్చి 11 న నిర్వహించ తలపెట్టిన సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఏపీ అధికారులు రాకపోవడంతో 13 వ సమావేశం.. వరుసగా రెండు సార్లు వాయిదా పడింది.

తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ …గోదావరి నది యాజమాన్యం బోర్డ్ సమావేశంకు ఏపీ వాళ్ళు హాజరుకాలేదు.వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేస్తే కూడా వారు హాజరుకాలేదు. జీఆర్ఎంబీ సమావేశానికి ఏపీ వాళ్ళు కావాలనే రాలేదన్నారు. వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సమావేశంకు హాజరు కావాల్సిందన్నారు. మేము వారి అభ్యంతరాలపై వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు క్లియరెన్స్ వచ్చాయి. ఏమైనా జీఆర్ఎంబీ పరిధిలో ఏమైనా ఉంటే సమావేశానికి హాజరై చెప్పాల్సి వుందన్నారు. జల శక్తి మంత్రిత్వశాఖ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు రజత్ భార్గవ. 6 నెలల్లోపు అన్ని ప్రాజక్ట్ లకు క్లియరెన్స్ వస్తాయి. సీతమ్మ సాగర్, తుపాకుల గూడెం కూడా హైడ్రాలజికల్ అనుమతులు వచ్చాయి, మిగతా అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని భావిస్తున్నామన్నారు. జలశక్తి శాఖ ఆడిగిన అన్ని ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఏపీకి కొత్త సెక్రటరీ వచ్చాడు అతడే కొంత సమయం అడిగారన్నారు రజత్ భార్గవ.

Read Also: IPL 2022: వైరల్ ట్వీట్.. ధోనీపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

Exit mobile version