Site icon NTV Telugu

MLC Polling: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ముగిసే వరకు144 సెక్షన్‌ అమలు..

Mlc Polling

Mlc Polling

MLC Polling: ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లా శాసనమండలి నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా నేడు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి సామగ్రిని తీసుకున్న ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Read also: Astrology: మే 27 సోమవారం దినఫలాలు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పురుష ఓటర్లు… 2 లక్షల 88 వేల 189, మహిళలు 1 లక్షా 75 వేల 645, ఇతరులు ఐదుగురు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో 1 లక్షా 66 వేల 448 మంది ఓటర్లు, 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 144 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34,176 మంది, మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు.

Read also: Remal Cyclone : 120కి.మీ వేగంతో గాలులు, వాన..బెంగాల్ లో మొదలైన రెమాల్ బీభత్సం

వారి కోసం 71 పోలింగ్ కేంద్రాలు. 99 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 20,838 మంది, మహిళా ఓటర్లు 13,242 మంది ఉన్నారు. వీరి కోసం 37 పోలింగ్ కేంద్రాలు, 59 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. 55 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండల కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 4659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. EC మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనపు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి.
Maoists : మావోయిస్టుల అనాగరిక చర్యలతో గిరిజనులకు ఇబ్బందులు

Exit mobile version