NTV Telugu Site icon

VasalaMarri Deveopment: సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిపై అధికారుల నజర్

vasalamarri

Collage Maker 20 Dec 2022 04.22 Pm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెడితే ఆ గ్రామం గానీ, నియోజకవర్గం దశ దిశ మారిపోతుంది. వాసాలమర్రి దత్తత తీసుకుంటున్నట్లు 2020 నవంబరులో ప్రకటించిన సీఎం కేసీఆర్‌ దీనిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథిని ప్రత్యేక అధికారిగా పర్యవేక్షణలో. గ్రామ పునర్‌నిర్మాణం రంగం సిద్ధమైంది అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు పనులు ముమ్మరం చేయనున్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హోస్ నుంచి యాదాద్రి వెళ్లే రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా చేస్తున్నారు వచ్చే జనవరి గ్రామాల్లో ఉన్న ఇండ్లను తొలగించి పునర్నిర్మాణం మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు అధికారులు.

Read Also: CPI RamaKrishna: బుగ్గన అప్పులు తెస్తేనే.. జగన్ బటన్ నొక్కే పరిస్థితి..!!

యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అధికారులు పనులను ప్రారంభించారు.గ్రామాన్ని మోడల్ విలేజ్ తయారు చేయడానికి.డిపిఓ సిద్ధం చేశారు వచ్చే నూతన సంవత్సరం లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే పనులు ప్రారంభించారు అధికారులు అందులో భాగంగానే రోడ్డు నిర్మాణం పనులను వేగవంతం చేస్తున్నారు.రెవెన్యూ అధికారులు కూడా గ్రామ అభివృద్ధి ప్రభుత్వ భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే జనవరి మొదటి వారంలో ఇండ్లను కుల్చేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

Read Also: Anchor Pradeep: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లి.. హాట్ టాపిక్ గా మారిన వధువు..?