NTV Telugu Site icon

HMDA : హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన ప్రభుత్వం.. ఆ గ్రామాలన్నీ విలీనం

Hmda

Hmda

HMDA : తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిధిని విస్తరిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ రోజు దాన్ని పూర్తి చేసింది. హెచ్ ఎండీఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలిపేసింది. దీంతో హెచ్ ఎండీఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి పెరిగిపోయింది. ఇంతకు ముందు 7 జిల్లాల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 11 జిల్లాల వరకు పెంచేసింది ప్రభుత్వం. ఓఆర్ ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు దీన్ని విస్తరించారు.

Read Also : Crime News : మద్యం తాగించి.. అసభ్యకర ఫొటోలు తీసి.. రూ.46 లక్షలు వసూలు

దీంతో మహా మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాబోతోంది. ఈ లెక్కన హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉంది. దీనికి మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ ఎండీఏ విస్తీర్ణం పెరగడంతో భూముల రేట్లలో భారీగా మార్పులు రాబోతున్నాయి. అలాగే అభివృద్ధి కూడా త్రిబుల్ ఆర్ దాకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి.