NTV Telugu Site icon

Minister KTR: నాంపల్లి బాధితులకు ఒక్కొక్కిరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

Ktr Nampalli

Ktr Nampalli

Minister KTR: నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వాళ్లకు సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఘటన స్థలానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. బజార్ ఘాట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారితో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం కింది భాగంలో రసాయనాలను నిల్వ చేయడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

 

Show comments