Site icon NTV Telugu

Governor Tamilisai: ప్రొటో కాల్ ఎక్కడ ఉంది..? మెస్ విషయంలో అసంతృప్తి..

Tamilisai

Tamilisai

Governor tamilisai soundararajan visits basara iiit campus: బాసర ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్‌ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి సైని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా పరీక్షించేందుకు నిర్మల్ జిల్లా బాసరకు శనివారం (నిన్న) రాత్రి బయలు దేరి వెల్లిన గవర్నర్‌. బాసర ట్రిపుల్‌ ఐటీలో మెస్‌ను ను గవర్నర్‌ పరిశీలించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనతరం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. మెస్‌ నిర్వాహణపై విద్యార్తులు అసంతృప్తిగా వున్నారని గవర్నర్‌ తెలిపారు. విద్యార్థుల 12 డిమాండ్ లను ఎస్ జీసీ గవర్నర్ తెలిపారు. విద్యార్థినిల సమస్యలు, మెస్ లలో పరిస్తితితో పాటు క్యాంపస్ లో పోలీస్ లు ఉండడాన్ని గవర్నర్ దృష్టికి విద్యార్థులు తెలిపారు.

హాస్టల్ క్యాంపస్, వాష్ రూమ్ లు కూడా గవర్నర్‌ చూసానని, విద్యార్థులు, ప్యాకల్టి తో మాట్లాడానని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో చాలా వరకు సమస్యలున్నాయని తెలిపారు. ల్యాప్ ట్యాప్ లు ఇవ్వలేదని, ప్రొటో కాల్ ఎక్కడ ఉందని గవర్నర్‌ మండిపడ్డారు. క్యాంపస్ లో పోలీసులు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు అని విద్యార్థులు చెప్పారని గవర్నర్‌ పేర్కొన్నారు. ఇంచార్జీ విసి కి చెప్పానని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్‌ తెలిపారు. మృతి చెందిన సంజయ్ కిరణ్ విషయం తన దృష్టికి వచ్చిందని, మెస్ ల విషయంలో విద్యార్థులు చాలాగా అసంతృప్తిగా ఉన్నారని గవర్నర్‌ అన్నారు. గవర్నర్ ప్రతిరోజు రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని తెలిపారు.

read also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి

గత నెల నుంచి విద్యార్థులు సరైన సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. సదుపాయాల్లో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఇందులో సంజయ్ అనే విద్యార్థి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. ఇటీవల ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కొత్త క్యాటరర్ ను నియమించానలి డిమాండ్ చేస్తూ మూడు పూటలు భోజనాన్ని బహిష్కరించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కోరుతూ.. రెండు రోజుల క్రితం ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ వీ వెంకట రమణ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. గత వారం విద్యార్థులు భోజనం చేయకుండా.. జాగారం చేసి నిరసన చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం, అధికార టీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ ఆఫీసుకు మధ్య దూరం ఏర్పడింది. ఇటు గవర్నర్ బహిరంగంగానే ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ తీరును తప్పుబడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తాజాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గవర్నర్ ని కలవడంపై టీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version