NTV Telugu Site icon

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి మాతృ వియోగం

Krishna Kumari

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు మాతృ వియోగం క‌లిగింది.. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా.. ఇవాళ తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు కృష్ణ‌కుమారి.. కాసేప‌ట్లో ఆమె భౌతిక‌కాయాన్ని హైద‌రాబాద్ నుంచి చెన్నైకి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కృష్ణ‌కుమారి మాజీ ఎంపీ కుమారినంద‌న్ భార్య.. ఆ దంప‌తుల ‌పెద్ద కుమార్తె గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. కృష్ణ‌కుమారి అంత్య‌క్రియ‌ల‌ను ఇవాళ చెన్నైలో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.