Site icon NTV Telugu

Governor Tamilisai : ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారు

Tamilisai Cm Kcr

Tamilisai Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇద్దరు సీఎంల దగ్గర పనిచేస్తున్నా.. ఇద్దరూ భిన్నమయిన వ్యక్తులని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పదవిలో వున్నా ప్రజలకు సేవచేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు.

అయితే ఆమె ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లలో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. అయితే ఆ సమయంలో ప్రొటోకాల్‌ పాటించలేదని గవర్నర్‌ తెలంగాణ గవర్నమెంట్‌పై గుర్రుగా ఉన్నట్లు, ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వెల్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం కేంద్ర తన పని తాను చేసుకుపోతుంది అని మాత్రం గవర్నర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Exit mobile version