Site icon NTV Telugu

Governor Tamilisai: రాజ్‌భ‌వ‌న్‌లో భోగి వేడుక‌లు.. పాయసం వండిన గవర్నర్‌

Govener Tamili Sai

Govener Tamili Sai

Governor Tamilisai: రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇవాళ ఉదయం గవర్నర్ తమిళిసై పొగల్ భోగి వేడుకల సందర్భంగా.. పాయసం వండారు. ఆమె కట్టెల పొయ్యి మీద కుండలో పాయసం వండారు. దేశ, తెలుగు ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రీరాముడిపై ఓ పాటను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు.

Read also: Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..

తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్ తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమని అన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు. శ్రీరాముడిపై ఓ పాటను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నట్టు గవర్నర్ తెలిపారు.

ఈ ఏడాది కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పారు. కాగా, శుక్రవారం పుదుచ్చేరి రాజ్‌నివాస్‌లో జరిగిన పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం కానున్నారు. అగ్రనేతలతో సమావేశాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..

Exit mobile version