Site icon NTV Telugu

Governor Tamilisai : ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని చేసుకుపోతుంది

Tamilisai

Tamilisai

తెలంగాణ గవర్నర్‌ తమిళిపై సౌందరరాజన్‌ ప్రొటోకాల్‌ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో గవర్నర్‌ తమిలిసై మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని ఆయన ఆరోపించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అని ఆమె ప్రశ్నించారు.

ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయటo నా లక్ష్యమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశౄరు. గిరిజనుల మంచి కోసం వాళ్ళ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇన్విటేషన్లను పొలిటికల్ గా చూడొద్దని, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారన్నారు. నేను తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తున్నానని, నాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, చేయాలనే ఆలోచన లేదని ఆమె తెలిపారు.

Exit mobile version