NTV Telugu Site icon

Revanth Reddy: గవర్నర్, ప్రభుత్వం ఒక్కటే.. అదంతా డ్రామా మాత్రమే

Revanth Reddy On Kcr

Revanth Reddy On Kcr

Governor State Government Playing Dramas Says Revanth Reddy: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన రోజు గవర్నర్, ప్రభుత్వం ఒక్కటి అవుతున్నారని.. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అవగాహనతోనే రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూములపై ఎంతోమంది దాడులు చేస్తే.. గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిందన్నారు. సెక్షన్ 8 ప్రకారం.. గవర్నర్ పరిధిలో అన్ని ఉన్నాయని, అందరు అధికారులను పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ కూడా చేయొచ్చన్నారు. Doptకి రికమెంట్ చేస్తే చాలని, CS మీద కూడా చర్చలు తీసుకోవచ్చని అన్నారు. సెక్షన్ 8 గురించి గవర్నర్‌కి తెలియకపోతే.. తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే, వెళ్లి చెప్తామన్నారు.

Steroid Injections: హైదరాబాద్‎లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పట్టివేత.. వాళ్లే టార్గెట్

ఎంఐఎం అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. ఏకగ్రీవం అవ్వడానికి బీజేపీ సహకరించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంఐఎం గెలుపు కోసం బీజేపీ పూర్తిగా మద్దతు తెలిపిందని అన్నారు. బీజేపీ పరోక్ష సహకారం అందిస్తే.. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్ష అవగాహన కలిగి ఉన్నాయని చెప్పారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని.. దీనిపై బీజేపీ స్పందించాలని అడిగారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్ర ఎవరు చేసినా తప్పు లేదన్నారు. ఉత్తమ్ చేసినా, మహేశ్వర్ రెడ్డి చేసినా తప్పు లేదని.. తప్పకుండా యాత్రలు చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. ఒకవేళ ఎవరైనా యాత్రలు చేయకపోతే, తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరూ యాత్రలు చేయాల్సిందేనని పిలుపు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. చేయని వారిపై పార్టీ సమీక్షించి, వారిపై తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..