Revanth Reddy: గవర్నర్, ప్రభుత్వం ఒక్కటే.. అదంతా డ్రామా మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor State Government Playing Dramas Says Revanth Reddy: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన రోజు గవర్నర్, ప్రభుత్వం ఒక్కటి అవుతున్నారని.. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అవగాహనతోనే రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూములపై ఎంతోమంది దాడులు చేస్తే.. గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిందన్నారు. సెక్షన్ 8 ప్రకారం.. గవర్నర్ పరిధిలో అన్ని ఉన్నాయని, అందరు అధికారులను పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ కూడా చేయొచ్చన్నారు. Doptకి రికమెంట్ చేస్తే చాలని, CS మీద కూడా చర్చలు తీసుకోవచ్చని అన్నారు. సెక్షన్ 8 గురించి గవర్నర్‌కి తెలియకపోతే.. తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే, వెళ్లి చెప్తామన్నారు.
Steroid Injections: హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పట్టివేత.. వాళ్లే టార్గెట్
Also Read
ఎంఐఎం అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. ఏకగ్రీవం అవ్వడానికి బీజేపీ సహకరించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంఐఎం గెలుపు కోసం బీజేపీ పూర్తిగా మద్దతు తెలిపిందని అన్నారు. బీజేపీ పరోక్ష సహకారం అందిస్తే.. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్ష అవగాహన కలిగి ఉన్నాయని చెప్పారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని.. దీనిపై బీజేపీ స్పందించాలని అడిగారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్ర ఎవరు చేసినా తప్పు లేదన్నారు. ఉత్తమ్ చేసినా, మహేశ్వర్ రెడ్డి చేసినా తప్పు లేదని.. తప్పకుండా యాత్రలు చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. ఒకవేళ ఎవరైనా యాత్రలు చేయకపోతే, తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరూ యాత్రలు చేయాల్సిందేనని పిలుపు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. చేయని వారిపై పార్టీ సమీక్షించి, వారిపై తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..
- Tags
తాజావార్తలు
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న OG 2
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!