NTV Telugu Site icon

Junior Panchayat Secretaries : జేపీఎస్‌‌లపై తెలంగాణ సర్కార్ సీరియస్.. విధుల్లో చేరకుంటే అంతే..

Jps

Jps

రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటిలోగా విధుల్లో చేరకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్టుగా సమాచారం. అయితే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేస్తోన్న సమ్మెపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read : Karnataka Elections: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే కీలకం..!

దీంతో.. సోమవారం మంత్రి ఎర్రబెల్లి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. జేపీఎస్‌ల సమ్మె వ్యవహారంలో కఠినంగా ఉండాలని.. రేపటిలోగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోతే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మే చేస్తోన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చివరి అవకాశం ఇస్తున్నామని.. రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల నుండి తొలగిస్తామని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read : Viral : చీరలో యువతి డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా..

Show comments