NTV Telugu Site icon

JPS Strike: జేపీఎస్‌ కు సాయంత్రం వరకు డెడ్‌ లైన్‌.. లేదంటే టర్మినేట్‌

Jps Strike

Jps Strike

JPS Strike: రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇవాల సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జేపీఎస్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే, చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాగా.. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు.

Read also: TS Inter Results: నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఈజీగా తెలుసుకోండి

ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుంచి జేపీఎస్ యూనియన్‌గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సుల్తానియా పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తను సొసైటీలు, యూనియన్లు చేరనని బాండ్‌పై సంతకం చేశానని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేదని ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్‌గా ఏర్పడి, చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుండి సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చివరి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఇవాల (మే 9) సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాల సాయంత్రం లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను

Show comments