NTV Telugu Site icon

DGP Mahender Reddy: దేశ వ్యాప్తంగా నిందితుల డేటాబేస్ మన దగ్గర ఉంది

Dgp Mahender Reddy

Dgp Mahender Reddy

DGP Mahender Reddy: రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా నిందుల డేటా బేస్‌ మన దగ్గర ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వం దిశా, నిర్దేశం చేసిందని పేర్కొన్నారు. అందులో భాగంగా గత ఎడాదిగా రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంట్రీ కాకుండా అడ్డుకుంటున్నామని తెలిపారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అడ్డుకొని సత్ఫలితాలను సాధిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాది ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగకుండా చూశామన్నారు. ఏ ప్రాంతంలో కూడా కర్ఫ్యూ అనేది లేకుండా చేశామని తెలిపారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో అధికారులు పగలు, రాత్రి కష్టపడి ప్రజల భాగస్వామ్యంతో చిన్న ఘటన జరగకుండా చూశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ టెర్రరిస్ట్ ఘటన జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ సిఐసెల్ చాలా బాగా పనిచేస్తుందని, రాష్ట్రంలో 800 పోలీస్ స్టేషన్లలో అధికారులు శాంతి భద్రతలను పరిరక్షించారన్నారు.

Read also: Liquor Lover: మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. రాత్రి వరకు మద్యం విక్రయాలు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరగడంతో క్రైమ్ రేటు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడి లు, కిడ్నాప్ లు, మోసాలు తదితర నేరాలు పెరిగాయని, కన్విన్షన్ 56 శాతం పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది జీవిత ఖైదుల సంఖ్య 30 శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1176 ఎన్‌డీపిఎస్ కేసులు నమోదయ్యాయని, షీటిమ్స్ ఈ ఏడాది 2128 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది 13895 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా..ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 762 హత్య కేసులు నమోదయ్యాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పది లక్షలకు పైగా సీసీ టీవి కెమెరాలు ఏర్పాలు చేశామన్నారు. సీసీ టీవి ఫూటేజీల ఆధారంగా 18 వేల కు పైగా కేసులను ఈ ఏడాది చేధించామని, పది లక్షల మంది నేరస్తులు డేటాబేస్ ఫోరెన్సిక్ దగ్గర ఉందని తెలిపారు.

Read also: Harish Rao: బీజేపీ హటావో సింగరేణి బచావో

రాష్ట్రానికి చెందిన వారే కాదు దేశ వ్యాప్తంగా నిందితుల డేటాబేస్ మన దగ్గర ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 431 మంది పై పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా ఐదు భరోసా సెంటర్ల ఏర్పాటు చేస్తామని..ఈ ఏడాది కమాండ్ కంట్రోల్‌ సెంటర్ ప్రారంభించు కోవడం గర్వంగా ఉందని పేర్కొ్న్నారు. వన్ స్టేట్.. వన్ సర్వీస్.. వన్ ఎక్స్‌పీరియన్స్.. పాలసీలో భాగంగా సీసీసీ ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 4.44% క్రైమ్ రేట్ పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయని అన్నారు. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్కౌంటర్లు జరగాయి, ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, 120 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. నక్సలైట్ల నుండి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని, 152 మందికి జీవితకాలం శిక్ష పడిందని పేర్కొన్నారు. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయని, ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను చేధించామన్నారు.

Read also: K.A.Paul: గ్రౌండ్ లో పెట్టాల్సిన సభ రోడ్డు మీద పెట్టారు

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 42 వేల 917 FIR లు నమోదయ్యాయని తెలిపారు. 938 జీరో FIR కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2,126 రేప్ కేసులు నమోదయ్యాయని అన్నారు. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా.. 2582 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయని, 2432 పొక్సో కేసులు నమోదు కాగా.. 2022 లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయని, 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశామన్నారు. 19,456 రోడ్ యాక్సిడెంట్స్ జరుగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారని, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశామన్నారు డీజీపీ. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 2022 లో 7లక్షల 66వేల ఈ పెటీ కేసులు వచ్చాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.