Site icon NTV Telugu

Hyderabad: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్

America Visa

America Visa

అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో సోమవారం నుంచి భారీ విద్యార్థి వీసా స్లాట్లను అమెరికా కాన్సులేట్ కార్యాలయం విడుదల చేసింది. స్లాట్ల కోసం వేచి ఉండే సమయాన్ని 911 రోజుల నుంచి 68 రోజులకు తగ్గించింది. అయితే పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం వెయిట్ చేయాల్సిందే. హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయంలో పర్యాటక వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారం కూడా 899 రోజులుగానే ఉంది.

Harish Rao: ఆస్పత్రుల నిర్వహణలో రాష్ట్రానికి మూడో స్థానం..

Exit mobile version