Site icon NTV Telugu

TS 10th Class Exam: టెన్త్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల గ్రేస్ టైమ్ ప్రకటించిన సర్కార్

10th Exams

10th Exams

TS 10th Class Exam: తెలంగాణ సర్కార్‌ 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం ను ప్రకటించింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌ లేకుండా రావచ్చని భావిస్తున్నారు. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్‌ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన వాటికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు రోజులూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి.

Read also: Election Commissioner: నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక.. ప్రధాని మోడీతో కీలక భేటీ

రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరణ కోరాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు.
Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్

Exit mobile version