పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ బంగాారాన్ని తరలించే పనిలో పడుతున్నారు.
కాగా ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుండి హైదరాబాద్ కు వచ్చిన మహిళ ప్రయాణికురాలు వద్ద బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.646 కేజీల అక్రమ బంగారం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుకున్న బంగారం విలువ 86 లక్షలు ఉంటుందన్నారు.
ఓ ప్రయానికురాలు పేస్ట్ రూపంలో సాక్స్ లలో బ్లాక్ కవర్ లో పెట్టి బంగారం తరలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళ ప్రయానికురాలిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
అయితే.. జూన్ 12న కువైట్ నుంచి హైదరాబాద్‌కు జే9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.. బంగారంపై రేడియం పూత పూసి ఇద్దరు మహిళల హ్యాండ్ బ్యాగులకు అమర్చి అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
కాగా.. జులై 11న దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంపై వెండిపూత పూసి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు పదిలక్షలకుపైగా ఉంటుందని తెలుస్తోంది.
YCP : ఊచలు లెక్కపెడుతున్నా మండలానికో అనుచరుడిని పెట్టుకుని చక్రం తిప్పుతున్నాడా..?
