Child Missing: పాప మిస్సింగ్ మిస్టరీ.. 24 గంటలు గడుస్తున్నా దొరకని ఆచూకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Missing: తెలంగాణలో చిన్నారుల మిస్సింగ్ కేసులు నగర ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న కవాడిగూడ లో పాప మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 24 గంటలు గడుస్తున్నా ఇంకాపాప ఆచూకీ ఏసమచారం లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పాప కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కోసం నాలుగు ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన పోలీసులు. ఇంట్లోంచి బయటికి వచ్చిన పాప ఆటోలో వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు పోలీసులు. ఆటో నెంబర్ ఆధారంగా పాపను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. పాప దగ్గర ఉన్న ఫోన్ చివరి లోకేషన్ ను ట్రేస్ చేస్తున్నారు..నాగోల్ లోని స్నేహపురి కాలనీ వద్ద పాప సెల్ ఫోన్ ట్రాక్ అయినట్టుగా గుర్తించారు పోలీసులు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగోల్ వరకు పాప ఎలా వెళ్ళింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
Read also: Raw Egg: పచ్చి గుడ్డు తింటే.. వామ్మో
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ముషీరాబాద్‌లోని కవాడిగూడలో 13 ఏళ్ల పాప అదృశ్యమైంది. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులకు వెళ్లడంతో పాప మాత్రమే ఇంట్లో ఉంటోంది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాలిక తండ్రి ఇంటికి ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన తండ్రి ఇంటికి వెళ్లాడు.. పాప ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారిని అడిగాడు లేదని సమాధానం ఇవ్వడంతో కంగారుపడిన తండ్రి చుట్టుపక్కల గాలించారు.. ఇంట్లో వారిని అడగ్గా పాప ఎక్కడికో వెళ్లిందని చెప్పారని తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. అన్నిచోట్లా వెతికినా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో నిన్న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య యువతి ఫోన్ సిగ్నల్స్ చూపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు, పాప తల్లిదండ్రులు స్నేహపురి కాలనీకి చేరుకున్నారు. అయితే అక్కడ పాప ఆచూకీ తెలియలేదు. మరోవైపు పాప మానసిక పరిస్థితి కూడా బాగోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పాపను ఏంచేశారో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే పాపా తనంతకు తాను వెళ్లిందా? లేదంటే ఎవరైనా పిలిస్తే వాళ్లతో వెళ్లడానికి బయటకు వెళ్లిందా? పాపకు అంతకుముందు ఎవరితో అయినా పరిచయాలు ఉన్నాయా? వారే పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!