NTV Telugu Site icon

Child Missing: పాప మిస్సింగ్ మిస్టరీ.. 24 గంటలు గడుస్తున్నా దొరకని ఆచూకీ

Kavadiguda

Kavadiguda

Child Missing: తెలంగాణలో చిన్నారుల మిస్సింగ్‌ కేసులు నగర ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న కవాడిగూడ లో పాప మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 24 గంటలు గడుస్తున్నా ఇంకాపాప ఆచూకీ ఏసమచారం లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పాప కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కోసం నాలుగు ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన పోలీసులు. ఇంట్లోంచి బయటికి వచ్చిన పాప ఆటోలో వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు పోలీసులు. ఆటో నెంబర్ ఆధారంగా పాపను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. పాప దగ్గర ఉన్న ఫోన్ చివరి లోకేషన్ ను ట్రేస్ చేస్తున్నారు..నాగోల్ లోని స్నేహపురి కాలనీ వద్ద పాప సెల్ ఫోన్ ట్రాక్ అయినట్టుగా గుర్తించారు పోలీసులు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగోల్ వరకు పాప ఎలా వెళ్ళింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Read also: Raw Egg: పచ్చి గుడ్డు తింటే.. వామ్మో

ముషీరాబాద్‌లోని కవాడిగూడలో 13 ఏళ్ల పాప అదృశ్యమైంది. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులకు వెళ్లడంతో పాప మాత్రమే ఇంట్లో ఉంటోంది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాలిక తండ్రి ఇంటికి ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన తండ్రి ఇంటికి వెళ్లాడు.. పాప ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారిని అడిగాడు లేదని సమాధానం ఇవ్వడంతో కంగారుపడిన తండ్రి చుట్టుపక్కల గాలించారు.. ఇంట్లో వారిని అడగ్గా పాప ఎక్కడికో వెళ్లిందని చెప్పారని తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. అన్నిచోట్లా వెతికినా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో నిన్న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య యువతి ఫోన్ సిగ్నల్స్ చూపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు, పాప తల్లిదండ్రులు స్నేహపురి కాలనీకి చేరుకున్నారు. అయితే అక్కడ పాప ఆచూకీ తెలియలేదు. మరోవైపు పాప మానసిక పరిస్థితి కూడా బాగోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పాపను ఏంచేశారో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే పాపా తనంతకు తాను వెళ్లిందా? లేదంటే ఎవరైనా పిలిస్తే వాళ్లతో వెళ్లడానికి బయటకు వెళ్లిందా? పాపకు అంతకుముందు ఎవరితో అయినా పరిచయాలు ఉన్నాయా? వారే పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.