ఈరోజుల్లో కుటుంబ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు యువత. అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు. రీల్స్ చేయడానికి ఒక ప్లేస్ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసేందుకు వెనకాడటం లేదు. ఒకరు చూస్తారనే భయంలేదు. విచ్ఛలవిడిగా రీల్స్ చేసి దానిని పోస్ట్ చేసి కామెంట్స్, వ్యూస్ కోసం తాప్రతయ పడుతున్నారు. రోడ్డు, పార్క్, వాష్ రూమ్స్ రీల్స్ చేయడానికి ప్లేస్ అంటూ లేకుండా ఎక్కడపడితే అక్కడే పెద్ద, చిన్నా అనే తారతమ్యం లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే స్పందించిన అధికారులు దేనికైనా ఒక లిమిట్ వుంటుంది అంటున్నారు. రీల్స్ లను ఎక్కడపడితే అక్కడ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
read also: Ramdas Athawale: శివసేనలో చీలికకు సంజయ్ రౌత్ కారణం
అయితే నిన్న ఓ అమ్మాయి ఏకంగా మెట్రో స్టేషన్ లో రీల్ చేసింది. ముందు వెనుక ఆలోచించకుండా విక్రాంత్ రోణ చిత్రంలో రా..రా.. రక్కమ్మ అనే సాంగ్ కు రీల్ చేసి, తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో రచ్చరేపింది. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా.. అవన్నీ పక్కన పెట్టి యువతి ఇవాళ ఏకంగా అంటే సుందరానికి సినిమా నుంచి హీరో నాని, నజ్రియా చేసిన తందనానంద అనే సాంగ్ కు మెట్రోలోనే స్టెప్పులేసిన మరో వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈవీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీని పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా పబ్లిక్ ప్లేస్ లో అందరు చూస్తున్న పట్టించుకోకుండా మెట్రోలో ఈ న్యూసెన్స్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత న్యూసెన్స్ చేస్తున్న రైల్వే అధికారులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
read also: President Election 2022 Result Live Updates: భారత నూతన రాష్ట్రపతి ఎవరు?
ఇది ఇలా వుండగా.. నిన్న మెట్రో స్టేషన్ లో స్కిట్ చేసిన యువతిపై మెట్రో అధికారి సీరియస్ అయ్యారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో స్కిట్ చేసినట్టుగా మెట్రో అధికారులు గుర్తించారు. మహిళలను గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో ట్రైన్ లు స్టేషన్ లో ఎలాంటి స్కిట్ లకు ఆ.. అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఫ్రాంక్ వీడియోలు స్కిట్ చేసిన వారిపై తప్పసరిగా చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఏకంగా మెట్రలోనే రీల్ చేసి పోస్ట్ చేసిన యువతిని పోలీసులు పట్టుకుని తగిన బుద్ది చెప్పాలని, మిగతావారు ఇలా చేయకుండా చూడాలని నెటిజన్లు కోరుతున్నారు.
President Election 2022 Result Live Updates: భారత నూతన రాష్ట్రపతి ఎవరు?