NTV Telugu Site icon

Yadagirigutta: యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ..

Yadagirigutta

Yadagirigutta

Yadagirigutta: యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు ప్రారంభించారు. మొదటిరోజు గిరి ప్రదక్షణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నేడు 5 వేల మందితో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ ఈఓ భాస్కర్‌రావు, వివిధ శాఖల అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి వైకుంఠద్వారం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై ముగియనుంది. అరుణాచలం, సింహాచలం ఆలయాల తరహాలో యాదాద్రి ఆలయంలో కూడా గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ భాస్కర్‌రావు వెల్లడించారు.

Read also: Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..

ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. అనాదిగా వస్తున్న గిరిప్రదక్షిణను భక్తులు విశేష సంఖ్యల్లో చేసుకోవాలని ఉద్దేశంతో స్వామి వారి దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్డును భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు చేసేవారు కాకుండా.. గిరిప్రదక్షిణలో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమంను నిర్వహించారు. కాగా.. వేల సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. కాగా.. 2016లో ఆలయ పునర్నిర్మాణానికి ముందు భక్తులు గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం యాదగిరిగుట్టపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు గిరి ప్రదక్షిణను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన స్వాతి నక్షత్రమైన ఈరోజు సుమారు 5 వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
Lockie Ferguson Record: ఫెర్గూసన్‌ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!