Site icon NTV Telugu

Hyderabad: భారత మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ

Ghmc

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ తుకారాంగేట్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి నివసిస్తున్న ఇంటిని శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారని.. దీంతో తాము ఇంటిని మరమ్మతులు చేయించినట్లు క్రికెటర్ శ్రావణి వెల్లడించింది. అయినా తమ ఇంటిని అధికారులు పరిశీలించకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించింది. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని వాపోయింది.

అయితే ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారుడు రామేశ్వర్‌గౌడ్, ఆయన అనుచరుల హస్తం ఉందని క్రికెటర్ శ్రావణి ఆరోపణలు చేసింది. ఈ మేరకు పద్మారావు గౌడ్ కార్యాలయానికి పిలిపించి రామేశ్వర్ బెదిరించాడని.. 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని ఆయన బెదిరించినట్లు ఆమె విమర్శలు చేసింది. అధికారం అడ్డం పెట్టుకుని ఆయన ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడింది. తాను 35 ఏళ్లుగా తన మేనమామ నివాసంలో ఉంటున్నానని వివరించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలో.. ఇంటి కోసం పోరాడాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా శ్రావణి ఇండియా తరఫున ప్రస్తుతం రంజీ మ్యాచ్‌లను ఆడుతోంది.

Padmarao Son Rameshwar Goud

Exit mobile version