హైదరాబాద్ తుకారాంగేట్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి నివసిస్తున్న ఇంటిని శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారని.. దీంతో తాము ఇంటిని మరమ్మతులు చేయించినట్లు క్రికెటర్ శ్రావణి వెల్లడించింది. అయినా తమ ఇంటిని అధికారులు పరిశీలించకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించింది. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని వాపోయింది. అయితే ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్…