Site icon NTV Telugu

కరాచీ బేకరీకి రూ.10వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ ఖాజాగూడలోని కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. కరాచీ బేకరీలో కొన్న స్వీట్లలో బూజు ఉందంటూ ఓ వ్యక్తి తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన… వెంటనే కరాచీ బేకరీపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు.

ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. బేకరీలోని వంటగదిలో పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్ వినియోగం, మురుగునీటి వ్యవస్థ సవ్యంగా లేకపోవడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడాన్ని నిర్ధారించిన అధికారులు బేకరీ యాజమాన్యానికి రూ.10వేల జరిమానా విధించారు.

Exit mobile version