Site icon NTV Telugu

GHMC : ఇల్లు కట్టడం ఈజీ.. GHMC గుడ్‌న్యూస్..

Ghmc

Ghmc

హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ (GHMC) విడుదల చేసిన గణాంకాలు నిర్మాణ రంగంలో వస్తున్న వేగాన్ని, పారదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 17,957 నిర్మాణ , లేఅవుట్ అనుమతులను మంజూరు చేసినట్లు జీహెచ్‌ఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్చి 2025లో అధికారికంగా ప్రారంభించిన ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారా ఈ అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది.

Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన మొత్తం 15,536 నిర్మాణ అనుమతుల్లో అత్యధికంగా 12,014 అనుమతులు ‘ఇన్‌స్టంట్ అప్రూవల్’ (తక్షణ అనుమతి) ద్వారా లభించడం విశేషం. మిగిలిన వాటిలో 2,515 అనుమతులు ‘సింగిల్ విండో’ విధానంలో, 972 అనుమతులు ‘ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్’ కింద జారీ అయ్యాయి. వీటితో పాటు అదనంగా 29 లేఅవుట్ అనుమతులు , 2,427 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను కార్పొరేషన్ జారీ చేసింది. ఈ అనుమతుల ప్రక్రియ ద్వారా జీహెచ్‌ఎంసీకి మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది వచ్చిన రూ.1,138.44 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఈసారి గణనీయమైన వృద్ధి నమోదైంది.

Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

ఆదాయ వసూళ్ల పరంగా చూస్తే.. సిఎంసీ (CMC) రూ.538.09 కోట్లు, జీహెచ్‌ఎంసీ (GHMC) రూ.436.47 కోట్లు, , ఎంఎంసీ (MMC) రూ.198.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ‘బిల్డ్ నౌ’ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, పారదర్శకత పెరగడమే కాకుండా దరఖాస్తుదారులకు అనుమతులు వేగంగా అందుతున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ నూతన విధానం నిర్మాణ రంగం అభివృద్ధికి మరింత ఊతాన్ని ఇస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Exit mobile version