GHMC : ఇల్లు కట్టడం ఈజీ.. GHMC గుడ్‌న్యూస్..
- జీహెచ్‌ఎంసీ అనుమతుల్లో రికార్డు వృద్ధి
- ‘బిల్డ్ నౌ’తో నిర్మాణ అనుమతులు సులభం
- ఇన్‌స్టంట్ అప్రూవల్స్‌తో వేగంగా ప్రాసెస్
- అనుమతుల ద్వారా రూ.1172 కోట్ల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ (GHMC) విడుదల చేసిన గణాంకాలు నిర్మాణ రంగంలో వస్తున్న వేగాన్ని, పారదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 17,957 నిర్మాణ , లేఅవుట్ అనుమతులను మంజూరు చేసినట్లు జీహెచ్‌ఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్చి 2025లో అధికారికంగా ప్రారంభించిన ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారా ఈ అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది.
Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన మొత్తం 15,536 నిర్మాణ అనుమతుల్లో అత్యధికంగా 12,014 అనుమతులు ‘ఇన్‌స్టంట్ అప్రూవల్’ (తక్షణ అనుమతి) ద్వారా లభించడం విశేషం. మిగిలిన వాటిలో 2,515 అనుమతులు ‘సింగిల్ విండో’ విధానంలో, 972 అనుమతులు ‘ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్’ కింద జారీ అయ్యాయి. వీటితో పాటు అదనంగా 29 లేఅవుట్ అనుమతులు , 2,427 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను కార్పొరేషన్ జారీ చేసింది. ఈ అనుమతుల ప్రక్రియ ద్వారా జీహెచ్‌ఎంసీకి మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది వచ్చిన రూ.1,138.44 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఈసారి గణనీయమైన వృద్ధి నమోదైంది.
Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..
ఆదాయ వసూళ్ల పరంగా చూస్తే.. సిఎంసీ (CMC) రూ.538.09 కోట్లు, జీహెచ్‌ఎంసీ (GHMC) రూ.436.47 కోట్లు, , ఎంఎంసీ (MMC) రూ.198.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ‘బిల్డ్ నౌ’ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, పారదర్శకత పెరగడమే కాకుండా దరఖాస్తుదారులకు అనుమతులు వేగంగా అందుతున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ నూతన విధానం నిర్మాణ రంగం అభివృద్ధికి మరింత ఊతాన్ని ఇస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!