Site icon NTV Telugu

Hyderabad Crime: హైదరాబాద్‌ లో షాకింగ్‌ ఘటన.. ట్రైన్ కు వేలాడుతూ మృతదేహం..

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: మేడ్చల్ జిల్లా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. MM రేక్ ప్యాసింజర్ ట్రైన్ కు గుర్తు తెలియని మృతదేహం వేలాడుతు ఘట్కేసర్ చేరుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీబీనగర్ సమీపంలో రైలుకు వేళాడుతూ మృతదేహం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వరకు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు.

Read also: Operation Raavan: పలాస హీరో ఆపరేషన్‌ రావణ్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

ఇవాళ ఉదయం రైల్వే స్టేషన్‌కు వచ్చిన వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు ఇంజన్‌ ముందు భాగంలో వృద్ధుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహం ఇంజిన్ ముందు భాగంలో ఇరుక్కుపోయి ఉండటాన్ని స్థానికులు, రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘట్‌కేసర్‌ దాటిన తర్వాత రైళ్లను నిలిపివేసి మృతదేహాన్ని బయటకు తీశారు.అయితే మృతదేహం తల రెండు భాగాలుగా చీలిపోయి ఉండటంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇతను ఎవరు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున బీబీ నగర్ వద్ద ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అయితే అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వరకు మృతదేహం వేలాడుతూనే ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Telangana Narcotics Police: బంపర్‌ ఆఫర్‌.. గంజాయి సమాచారం ఇవ్వండి రూ.2 లక్షలు పొందండి..

Exit mobile version