NTV Telugu Site icon

Credit card fraud: క్రెడిట్ కార్డ్ పేరుతో ఘరానా మోసం.. 20 వేలు మాయం

Credit Card

Credit Card

Credit card fraud: సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. సైబర్‌ ఫ్రాడ్‌ పై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్‌ నేరానికి తెర లేపుతున్నారు. ఈకాలంలో ఆన్‌లైన్‌ పేమెంట్లు, షాపింగ్‌లు, క్రెడిట్‌ కార్డులతో పేమెంట్‌లు చేయడం. ఫ్రీ క్రెడిట్‌ కార్డు అంటూ కాల్ చేయడం ఇలా మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకమైన ప్రజలను మోసం చేయడానికి సైబర్‌ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. అయితే సైబర్‌ నేరాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పించినా అది అవగాహనకు మాత్రమే పరిమితమవుతున్నాయి. సైబర్‌ నేరులు ఏదో ఒక రకమైన మోసాలతో వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు క్షణంలో జరిగిన సైబర్‌ ఫ్రాడ్‌ పై అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు వెలుగులోకి రావడం పోలీసులకే తలనొప్పిగా మారింది. ఒకరు ఓటీపీ స్కామ్‌, మరొకొందరు డెలివరీ బాయ్‌ గా, కరెంట్‌ బిల్లు పేరుతో అకౌంట్‌ ఖాళీ చేయగా ఇప్పుడు క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేషన్‌ అంటూ కాల్‌ చేసి వేల సంఖ్యలో డబ్బులు కాజేశాడు కేటుగాడు. ఈఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: land for job case: నేడు ఈడీ ముందుకు తేజస్వి… బిహార్ డిప్యూటీ సీఎంపై ఉచ్చు బిగుస్తోందా?

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నాగరాజు అనే వ్యక్తి కామారెడ్డి వాసి. నాగరాజుకు క్రెడిట్‌ కార్డు పేరుతో కాల్ వచ్చింది. దీంతో క్రెడిట్‌ కార్డు కదా మంచిగనే ఉంటుందని భావించాడు నాగరాజు. ఇప్పటి వరకు వున్న క్రెడిట్‌ కార్డు కాకుండా మరో క్రెడిట్‌ కార్డు వస్తుందని కాల్ రావడంతో సరే ఇంకోటి వస్తుందని భావించిన నాగరాజు. దీంతో నెల రోజుల క్రితం మరో క్రెడిట్ కార్డు పంపిన బ్యాంక్ సిబ్బంది. అయితే కార్డు యాక్టివేషన్ కోసం ఆన్లైన్ లో కస్టమర్ కేర్ నంబర్ నాగరాజు వెతికాడు. కస్టమర్ కేర్ నంబర్ కు ఫోన్ చేయగా ఓటీపీ చెప్పమని అడగడంతో ఓటీపీ చెప్పాడు అంతే. నాగరాజు ఓటీపీ చెప్పడమే ఆలస్యం బ్యాంక్ అకౌంట్ లో నుంచి 20 వేల రూపాయలు మాయమైపోయాయి. నాగరాజుకు డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌ రావడంతో షాక్‌ తిన్నాడు. మళ్లీ అదే నెంబర్‌ కు కాల్ చేయగా రెస్పాన్స్‌ రాకపోవడంతో మోసపోయానని భావించిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్