తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల… తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రకటించారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆదిలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.. ఎందుకంటే.. అప్పటి వరకు తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి… ఏప్రిల్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు.. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు.. వైఎస్ షర్మిల పార్టీలో కీలకంగా పనిచేస్తారని అనుకుంటున్న సమయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి.. జులై 1వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు గట్టు.. ఆయనతో పాటు హుజూర్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీ చేరనున్నట్టు తెలుస్తోంది.
వైఎస్ షర్మిలకు షాక్..! బీజేపీలోకి గట్టు శ్రీకాంత్‌రెడ్డి

Gattu Srikanth Reddy