NTV Telugu Site icon

Mahalakshmi Scheme: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం.. పూర్తి డబ్బు చెల్లించాల్సిందే..!

R.500 Gas Cylender

R.500 Gas Cylender

Mahalakshmi Scheme: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేపు (మంగళవారం) మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయనున్నారు. అయితే రేపు చేవెళ్ల గడ్డపై ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారితో పాటు సాధారణ కనెక్షన్లు ఉన్నవారిని కూడా తగ్గిస్తుంది. అయితే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ రాగానే పూర్తి సొమ్ము చెల్లించేలా పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.500 అదనంగా చెల్లించిన ధరను తిరిగి చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.955 ఉంటే లబ్ధిదారుడు రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా మిగిలిన రూ.415 బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అయితే, నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వేర్వేరు ధరలు ఉన్నాయి.

Read also: Chiranjeevi: డబ్బు ఖర్చు చేస్తేనే రిచ్ నెస్ రాదు.. తెలుగు డైరెక్టర్లకు చిరు చురకలు

హైదరాబాద్‌లో రూ.955 ఉంటే, ఇతర నగరాల్లో రవాణా ఛార్జీల్లో వ్యత్యాసం కారణంగా రూ.970, 974గా ఉంది. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కేంద్రం నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.340 సబ్సిడీ పొందుతున్నారు. మహాలక్ష్మి పథకంలో ఎంపికైన లబ్ధిదారులు సిలిండర్‌కు చెల్లించే ధరలో కేంద్ర సబ్సిడీ పోను.. రూ.500 కంటే ఎక్కువ ఉంటే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుస్తోంది. ఉదాహరణకు సిలిండర్ ధర రూ.970 అయితే లబ్ధిదారుడు రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.340, రాష్ట్ర సబ్సిడీగా రూ.130 జమ చేస్తారు.

Read also: Telanagan: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి

సుదూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలతో పాటు సిలిండర్ ధర అదనంగా పెరిగినా ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారుల జాబితాను సోమవారం జిల్లాల వారీగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అధికారులు అందజేయనున్నట్లు సమాచారం. అడ్వాన్స్ మొత్తం కూడా చెల్లించనున్నారు. ఈ మేరకు రూ.80 కోట్లు విడుదల చేసేందుకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యను బట్టి సబ్సిడీ సొమ్మును ఎప్పటికప్పుడు చమురు కంపెనీలకు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Mallu Ravi: కళ్లుండి చూడలేని కబోదులు మీరు.. మల్లురవి ఫైర్