Site icon NTV Telugu

Garikapati Narasimha Rao: చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే.. నేను వెళ్లిపోతా

Garikapati Alai Balai

Garikapati Alai Balai

Garikapati Narasimha Rao Got Furious Over Chiranjeevi Photo Session In Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ‘అలయ్ బలయ్’ వేడుకల్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. తాను ప్రసంగిస్తున్న సమయంలోనే.. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటో సెషన్ ప్రారంభమైంది. దీంతో అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. కెమెరామెన్లు, ఫోటో దిగాలనుకున్న అభిమానులందరూ.. చిరుని చుట్టుముట్టేశారు. ఈ పరిణామంతో కాస్త ఆగ్రహానికి లోనైన గరికపాటి.. ‘అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్‌ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతాన’ని అన్నారు. అనంతరం.. ‘చిరంజీవి, దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను’ అని చెప్పారు. అనంతరం సిబ్బంది వచ్చి అటువైపుగా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా, తన ప్రసంగాన్ని ఆపేసి గరికపాటి చిరు ఫోటోసెషన్ వైపుకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో చిరు తన ఫోటోసెషన్ ఆపేసి, ఆయన పక్కన కూర్చున్నారు. అప్పుడు మళ్లీ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు గరికపాటి. అయితే.. ఈ వ్యవహారంలో గరికపాటి నొచ్చుకోకుండా, చాలా కూల్‌గా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.

ఇదిలావుండగా.. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ అలయ్‌ బలయ్‌ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి డోలు వాయిస్తూ హాజరయ్యారు. మెడలో డోలు వేసుకుని.. ఉత్సాహంగా డోలు వాయించిన ఆయన, స్టెప్పులు కూడా వేశారు. పక్కనే ఉన్న బండారు దత్తాత్రేయ కూడా.. చిరుతో పాటు డోలు వాయిస్తూ, స్టెప్పులేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గరికపాటి నరసింహారావు, భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సినీ నటుడు బాబూమోహన్, ఎమ్మెల్యే రఘునందనరావు, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version