Site icon NTV Telugu

Gangula Kamalakar: డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది..?

Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar:డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది? అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగుసార్లు వరుసగా నన్ను గెలిపించారు.. ఈ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనాలని అన్నారు. అత్యంత గట్టి పోటీ నడుమ… ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ నాలుగోసారి నన్ను గెలిపించడం సాధారణ విషయం కాదని తెలిపారు. బండి సంజయ్ లాంటి జాతీయ స్థాయి నేత, కాంగ్రెస్ వాగ్దానాలు ఉన్నప్పటికీ నేను గెలవడం అత్యంత సంతోషమన్నారు.

Read also: Hanuman: ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్స్… ఓవరాల్ గా 200 కోట్లు?

రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఒక్క కరీంనగర్లో మాత్రమే విజయం సాధించామన్నారు. ప్రజా తీర్పును శిరసావహించినం… వారి తీర్పును తప్పు పట్టలేమన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది? అని ప్రశ్నిచారు. సాగుకు నీళ్లు ఇవ్వడం లేదు ఆరుతడి పంటలు అంటున్నారని తెలిపారు. రైతు బంధు ఇప్పటికీ వేయలేదని గుర్తు చేశారు. వరి పంట వేయొద్దని అంటున్న వారు బోనస్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. ప్రజల వెంట ఉంటాం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేసేవరకు కొట్లాడతామన్నారు. అభివృద్ధిని కొనసాగింపు చేయాలన్నారు. రుణమాఫీ అన్నవాళ్ళు లోన్లు కట్టాలి అని నోటీసులు ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Prabhas: మూడు గంటల సినిమాలో ప్రభాస్ మాట్లాడింది మూడు నిమిషాలేనా?

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల ఓడిపోయామని, కేసీఆర్ పై వ్యతిరేకత లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియదన్నారు. పొన్నం ప్రభాకర్ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైందన్నారు.
Malla Reddy: త్వరలో పులి బయటకు వస్తోంది… అప్పుడు ఆట మొదలవుతుంది

Exit mobile version