Gangula Kamalakar: మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో సింగపూర్ తరహాలో కరీంనగర్ త్వరలో అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం డేకేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఒంటరిగా ఉంటే అనారోగ్యం అని అంటారు. పదిమందితో కలిసి ఉంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో సింగపూర్ తరహాలో కరీంనగర్ త్వరలో అభివృద్ధి చెందుతుందన్నారు. గత ప్రభుత్వాలు సమైక్య పాలనలో పేదలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. స్వరాష్ట్రంలో పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామలా కల్యాణలక్ష్మి ఇస్తున్నారని వెల్లడించారు.
Read also: MLA Raja Singh: తలసానిపై బీజేపీ నేత రాజాసింగ్ ప్రశంసలు.. అయోమయంలో ప్రజలు
సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నేత అని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వృద్ధుల సేవల కోసం హెల్ప్ లైన్ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ తెలంగాణలో వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చామన్నారు.
SBI: SBI బ్యాంక్ ఖాతాను మరొక బ్రాంచ్‌కి బదిలీ చేయాలా.. చాలా సింపుల్