Minister Gangula Kamalakar Firedon Union Minister Piyush Goyal.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై టీఆర్‌ఎస్ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీకి వెళ్లిన టీఆర్‌ఎస్ మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణ మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ ను మంత్రిగా నేను 5 సార్లు కలిసానన్నారు. ప్రతి సారి సమావేశంలో పీయూష్ గోయల్ మమ్మల్ని అవమానించారు…అయిన తెలంగాణ కోసం భరించామని ఆయన వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి, మార్చిలో రెండు సార్లు తెలంగాణ అధికారులు కేంద్రం పెట్టిన సమావేశంకు హాజరు అయ్యారని, కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి ఎవరి తరపున మాట్లాడ్తున్నారని ఆయన ప్రశ్నించారు. పారా బాయిల్డ్ ఇవ్వమని మా మెడపై కత్తి పెట్టి కేంద్రం మా దగ్గర నుంచి కేంద్రం లేఖ తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
