NTV Telugu Site icon

Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై తొలగిన వివాదం.. ఏర్పాట్లు పూర్తి

Ganesh Immersion Hussain Sa

Ganesh Immersion Hussain Sa

Ganesh Immersion Arrangement Completed At Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. మట్టి గణపతితో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేయడానికి అనుమతి లభించింది. అటు.. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శానిటేషన్ వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ఆర్ & బి హార్టికల్చర్‌తో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ట్యాంక్‌బండ్ పల్సర్ ప్రాంతంలో 20,000 మందితో భారీ బందోబస్తు నిర్వహించారు.

ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీవీ మార్గ్‌లో 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన విధుల్లో 10 వేల మంది జిహెచ్ఎంసి సిబ్బంది.. నిమజ్జనాల పర్యవేక్షణకు 168 మందితో జీహెచ్ఎంసీ అధికారుల బృందం రంగంలోకి దిగారు. గణేష్ విగ్రహాల వ్యర్థాలను తొలగించేందుకు వాటర్ క్లీనింగ్ మెషీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు, ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు. 74 ప్రాంతాల్లో బేబీ పౌండ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. రేపు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను నిషేధించారు. ఏర్పాట్లపై ఎలాంటి రాజకీయాలు తగదని ప్రభుత్వం తెలిపింది. కాగా.. గ్రేటర్‌లో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.