అసలే కరోనా కాలం…. హాస్పిటల్ అంటేనే భయపడే కాలం… అలాంటి వాటిలో పని చేసేందుకు ఎవరు ముందుకు రారు.. అలాంటిది వారు ముందుకు వచ్చారు…. మొదట్లో మీకు ఇన్ని పని గంటలు… ఇంత జీతం అని పనిలో చేర్చుకొని… తీరా పని చేసిన తర్వాత చేతులెత్తేశారు… జీతాలు ఇవ్వకుండా చేతులేత్తేసింది ఎక్కడో ప్రైవేట్ కంపెనీ కాదు… ప్రభుత్వమే… గాంధీ హాస్పిటల్ లో కరోనా కోసం అని కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ని తీసుకున్నారు… రోజుకు 500 రూపాయిల చొప్పున నెలకు 15 రోజులు మాత్రమే పని చేయాలని చెప్పి తీసుకొని గత 4నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ వారిని తిప్పుకుంటన్నారు… దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు నాలుగో తరగతి ఉద్యోగులు.. కోవిడ్ అత్యవసర పరిస్థితిలో తమను విధుల్లోకి తీసుకొని ప్రస్తుతం నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.
మూడు నెలలుగా ఇంటి అద్దె కూడా కట్టని పరిస్థితి తమదని, వెంటనే జీతాలు చెల్లించాలంటూ ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు వందలాది మంది కార్మికులు నిరసన తెలిపారు. వారి ఆందోళనకు దిగివచ్చిన కాంట్రాక్టర్లు గురువారంలోగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లోకి చేరారు. దాదాపు 250 మంది కార్మికులు ఇలా రోడ్డెక్కారు… గురువారంలోగా మా జీతాలు చెల్లించకుంటే ఈ సారి విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామని ఎట్టి పరిస్థతుల్లో మాకు జీతాలు చెల్లించాలని సూపర్ వైజర్‌ని, వైద్యాధికారులను కోరారు… మావి మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని, ఎన్ని సార్లు విన్నవించుకున్నా మా సమస్యలు పరిష్కారం కాలేదు అని ఈ సారి పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
https://ntvtelugu.com/mla-sridhar-babu-protest-for-paddy-procurement/
