NTV Telugu Site icon

Harish Rao:ములుగులో మరో కోల్డ్ స్టోరేజీ, పండ్ల మార్కెట్

Harish Rao

Harish Rao

ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమ‌ని మంత్రి హ‌రీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమ‌ని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామ‌ని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామ‌ని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామ‌ని హ‌రీశ్ రావ్ అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల మేలు కోసమే సీఎం కేసీఆర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వచ్చాక అన్నీ అభివృద్ధి పథంలో మారి దూసుకుపోతున్నామ‌ని హ‌రీశ్ రావ్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు మ‌న‌ సీఎం కేసీఆర్ అని తెలిపారు.

ప్రయివేటు ఆస్పత్రులకంటే గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రయివేటు ఆసుపత్రికి పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని హ‌రీశ్ రావ్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఆరోగ్య లక్ష్మీ పథకం సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఆరోగ్య మంత్రి హరీశ్ కోరారు. త్వరలోనే సంగారెడ్డికి కెనాల్ తెచ్చి.. కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం. ములుగులో మరో కోల్డ్ స్టోరేజీ, పండ్ల మార్కెట్ తెస్తున్నామన్నారు హరీష్ రావు.

CPI Ramakrishna: విజయవాడ జగన్ అబ్బ సొత్తా?

Show comments