Site icon NTV Telugu

Gadwal Murder : మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్‌.. తేజేశ్వర్ కేసులో తెరపైకి సంచలన విషయాలు

Gadwal Murder

Gadwal Murder

Gadwal Murder : గద్వాల నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులైన A1 తిరుమల రావు, A2 ఐశ్వర్యలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు.

విచారణలో తిరుమల రావు ఐశ్వర్యపై అనుమానంతో ఆమె స్కూటీకి జీపీఆర్ఎస్ (GPS) అమర్చినట్లు తేలింది. ఐశ్వర్య కదలికలను నిరంతరం ట్రాక్ చేయడానికి తిరుమల రావు ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు.

UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

తేజేశ్వర్ హత్య వెనుక ఐశ్వర్య ఒత్తిడి ఉందని విచారణలో వెల్లడైంది. ఐశ్వర్య బలవంతం చేయడంతోనే తిరుమల రావు సుపారీ గ్యాంగ్‌తో తేజేశ్వర్‌ను హత్య చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతేకాకుండా, ఐశ్వర్యకు తిరుమల రావుతో పాటు మరో ఇద్దరితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తేజేశ్వర్ హత్య కేసులో ఈ కొత్త విషయాలు కేసును మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారించి, ఈ హత్యకు గల పూర్తి కారణాలను, ఇందులో ఉన్న ఇతర వ్యక్తులను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.

Wife kills husband: లవర్‌తో అభ్యంతరకర స్థితిలో భార్య.. చివరకు భర్త హత్య..

Exit mobile version