NTV Telugu Site icon

ఒకే వీడియోతో సంచ‌ల‌నం… ఆ ‘గద్వాల రెడ్డి బిడ్డ’ ఇక లేడు..

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత స్టార్లే కాదు.. కొంద‌రు సామాన్యులు కూడా ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోతున్నారు.. చిన్నా వీడియాలో వారి జీవితాల‌నే మార్చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో.. సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచ‌ల‌నం సృష్టించిన గద్వాల రెడ్డి బిడ్డ అలియాస్ మ‌ల్లికార్జున్ రెడ్డి… ఆదివారం మృతిచెంద‌డం తీవ్ర విషాదంగా మారింది.. ‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల రెడ్డి బిడ్డ..’ అంటూ తెలిసితెలియ‌క చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు మల్లికార్జున్.. కొన్ని వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి రావ‌డంతో.. చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.. ఆ త‌ర్వాత మ‌రికొన్ని వీడియోల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు ఈ బుడ‌త‌డు..

Read Also: అస‌దుద్దీన్‌ ఒవైసీపై కాల్పులు.. నేడు పార్ల‌మెంట్‌లో అమిత్ షా ప్ర‌క‌ట‌న‌

కానీ, అనారోగ్య స‌మ‌స్య‌లు గద్వాల రెడ్డిబిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి ప్రాణాలు తీశాయి.. చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆ బుడ‌త‌డు ఆదివారం మృతిచెందాడు.. ఇక‌, అతని స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నలో ఇవాళ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కుటుంబసభ్యులు వెల్ల‌డించారు.. ఒకే వీడియోతో సంచ‌ల‌నంగా మారి.. ఆ త‌ర్వాత ప‌లు వీడియోలు చేసిన ఎంతో మందిని ఆక‌ట్టుకున్న‌ మ‌ల్లికార్జున్ రెడ్డికి సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలుపుతున్నారు.