సామాన్య ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే వెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.42, డీజిల్ ధర రూ. 101.58కు చేరింది. అలాగే గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.32, డీజిల్ ధర రూ. 103.10 వద్దకు చేరింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. నేడు కాంగ్రెస్ నాయకులు ఇంధనం ధరల పెంపుపై నిరసనలు వ్యక్తం చేయనున్నారు.