Site icon NTV Telugu

అడవులను కాపాడుకుందాం: మంత్రి జగదీష్ రెడ్డి

పోడు భూముల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులకు, అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నదని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. యదాద్రి జిల్లాలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూములలో కబ్జాలు లేని 2006 చట్టం ప్రకారం అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక నుంచి అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలనుసారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సమస్యలను విన్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.అడవులను కాపాడుకొనే విధంగా అన్ని పార్టీల నాయకులతో ప్రతిజ్ఞ చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2014 నుంచి అడవులను పెంపొందించే విధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. అటవీ భూముల్లో చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు.

Exit mobile version