సోషల్ మీడియా బాగా విస్తరించింది. యువత బాగా అట్రాక్ట్ అవుతోంది. యువతనే టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కిలాడీ లేడీ గుట్టు రట్టయింది. సోషల్ మీడియా అకౌంట్లో ద్వారా ట్రాప్ చేస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. Instagram,facebook లలో అందమైన ఫొటోస్, వీడియోలు పెట్టి మోసాలకు పాల్పడుతోంది ఆ యువతి. మోసపోయిన యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. కృష్ణాజిల్లా చెందిన పరాస తనుశ్రీని అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
Read Also: Ireland Prime Minister : ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
వివిధ సినిమాలకు సంబంధించిన పాటలకు టిక్ టాక్ టైప్ వీడియోలు చేసి యువతను అట్రాక్ట్ చేస్తోంది తనుశ్రీ. అందంగా ముస్తాబై వీడియోలని అప్లోడ్ చేస్తుంది తనుశ్రీ.. సోషల్ మీడియా అకౌంట్లో లైకులు కొట్టిన వారిని ట్రాప్ చేస్తుంటుంది తనుశ్రీ. ప్రేమ పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది ఆ యువతి. హైదరాబాద్ కు చెందిన యువకుడి దగ్గరనుంచి 31 లక్షల రూపాయలు లాగేసింది తనుశ్రీ.. బ్లాక్ మెయిల్ చేసి ఆమె డబ్బులు వసూలు చేస్తోంది. తనుశ్రీ ప్రియుడు శ్రీకాంత్ ను కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. లవర్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది దగ్గర నుంచి డబ్బులు లాగేసిన వైనం వెలుగులోకి వచ్చింది. Honey trapకి పాల్పడి యువకులని చీట్ చేస్తున్నారు ఈలవర్స్. వీరి బారిన పడి ఎంతోమంది మోసపోయారని తెలుస్తోంది.
Read Also: India vs Bangladesh: చిట్టగాంగ్ టెస్టులో భారత్ ఘన విజయం..