Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత నాలుగు రోజుకు చేరింది. నాలుగు రోజుల నుంచి అధికారులకు చిరుత ముప్పుతిప్పలు పెడుతుంది. బోన్ వరకు వచ్చి చిరుత వెళ్ళిపోతుండటంలో అధికారులకు ఆపరేషన్ చిరుత సవాల్ గా మారింది. ఇప్పటికే చిరుతను బంధించేందుకు 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిరుత దృశ్యాలు కనిపించాయి. మేక ను ఎరగా వేసినా… బోను లోకి చిరుత రాకపోవడంతో అధికారులు చిరుతకోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో అధికారులు నాలుగు రోజులుగా చిరుతకోసం వేట మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండటంతో.. వేరే ప్రాంతానికి చిరుత వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు.
Read also: Yarlagadda Venkat Rao: చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.
Big Saving Days Sale 2024: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మోటో ఎడ్జ్ 40 నియోపై భారీ తగ్గింపు!