NTV Telugu Site icon

Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో నలుగురు సీఎంలు

Yadadri

Yadadri

Yadagirigutta: లక్షీనరసింహ ఆలయానికి దర్శించుకునేందుకు నలుగురు సీఎంలు యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ తోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. యాద్రాద్రి ఆలయ అధికారులు సీఎంలను ఘనంగా స్వాగతించారు. పట్టు వస్త్రాలు సమర్పించి సన్మానించారు. నాలుగు రాష్ట్ర సీఎంలు యాదాద్రికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు చేశారు. నలుగురు సీఎంలు స్వామిని దర్శించుకున్న అనంతరం యాదాద్రి నుంచి ఖమ్మం బయలు దేరనున్నారు.

Read also: IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..

నేరుగా ఖమ్మంలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో నలుగురు సీఎంలు పాల్గొంటారు. ఖమ్మంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నేడు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఆడిటోరియంలో సీఎం కేసిఆర్, ఇతర సీఎం లతో 6 గురు వ్యక్తులకు కళ్ళద్దాలను ఇస్తారు. రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వెంపటి కమలమ్మ, అమరనేని వెంకటేశ్వర్లు, అనుబోతు రామనాథం, షేక్ గౌసియా బేగం, ధరావత్ పిచ్చమ్మ, కోలేం జ్యోతిలు కళ్లద్దాలను అందజేయనున్నారు.

Read also: Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!

ఉదయం ప్రగతి భవన్‌లో సీఎంలు కేరళ సీఎం పినరయి విజయన్, కేజ్రీవాల్, భగవంతు మాన్ లో సీఎం కేసీఆర్‌ బ్రేక్ ఫాస్ట్ చేశారు. వీరితో పాటు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సీపీఐ రాజా, అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ రాజకీయ పరిస్థితుల చర్చించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దర్శించుకునేందుకు బయలు దేరారు.
Hyderabad Traffic Restrictions: ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకంటే?