NTV Telugu Site icon

Formula E: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ రేసింగ్.. ఎన్‌టీఆర్‌ మార్గ్ పూర్తిగా క్లోజ్

Formula E

Formula E

Formula E: ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది. దీనికంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్ డిసెంబర్ నెలలో రెండు సార్లు చేసిన విషయం తెలిసిందే.. అప్పుడు జరిగిన తప్పులను ఇప్పుడు సవరించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపటి నుండి అసెంబ్లీ కొనసాగిపోతుంది దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కూడా ఉన్నందున, ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఫార్ములా ఈ రేసింగ్ జరిగే ప్రాంతాల్లోనే మూడు ముఖమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫార్ములా ఈ రేసింగ్ కి 21,000 మంది వీక్షించడానికి రాబోతున్నారనట్లు అంచనావేశారు.

Read also: Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లలేదు.. వేళ్ళగొట్టారు..!

11 స్టాండ్లు ఏర్పాటు చేశారు, 7 గేట్లు ఉన్నాయి. నాలుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. పార్కింగ్ కోసం 16 ప్రాంతాలు సిద్ధం చేశారు. 300 మందితో లాండ్ ఆర్డర్ పోలీసులు ఉండనున్నారు. 275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు విధుల్లో ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం, మన నగరంలో నిర్వహించబోతున్నారు. వాహనదారులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, నగరవాసులందరూ సహకరించాలని అధికారులు స్పష్టం చేశారు. మూడు, నాలుగు తేదీల్లో ఎలాంటి డైవర్షన్స్ ఉండవు కానీ ఆరవ తేదీ నుండి డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ట్రాక్ పై చాలా పనులు ఉన్నాయని నిర్వాహకులు కోరారు. కాబట్టి 5 వ తేదీ పూర్తిగా క్లోజ్ చేస్తామని ప్రకటించారు. ఏడవ తేదీ నుండి 12 వ తేదీ వరకు ఎన్‌టీఆర్‌ మార్గ్ పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఈ డైవర్షన్ గుర్తు పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాలని కోరారు.
Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ పర్యటన.. మంత్రి స‌మ‌క్షంలో 100 మంది చేరిక

Show comments