Site icon NTV Telugu

CI Nageshwar Rao : సీఐ నాగేశ్వర్‌రావుపై మాజీ ఎంపీ విసుర్లు..

Ci Nageshwar Rao Tg Venkate

Ci Nageshwar Rao Tg Venkate

హైద్రాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల సీఐ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళల జీవితాలకు నష్టం జరిగే విధంగా సీఐ నాగేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ అయ్యే సందర్భంలో అనవసరంగా ఆస్తి విషయంలో కేసులో ఇరికించాడంటూ టీజీ వెంకటేష్‌ ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారే తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా చెప్పినా కూడా పేరు తీసేయడంలో తీవ్ర జాప్యం చేశాడు టీజీ వెంకటేష్‌ ధ్వజమెత్తారు. పోస్టింగ్ కోసం ఉన్నతాధికారులకు, నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చానని, నాకు కూడా అంతే డబ్బులు రావాలని సీఐ ప్రచారం చేసుకున్నాడన్న టీజీ వెంకటేష్‌.. సీఐ నాగేశ్వరరావును జైలులో పెట్టి శిక్ష పడేలా చేయాలన్నారు. లేకుంటే పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ త‌న‌ను రేప్ చేశార‌ని తీవ్రంగా ఆరోపించింది మహిళ. అడ్డువ‌చ్చిన త‌న భ‌ర్త త‌ల‌ప‌గులగొట్టాడని, ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని బ‌య‌ట‌కు తీసుకెళ్లార‌ని తెలిపింది బాధిత మహిళ. అయితే ఇబ్రహీంపట్నంలో వాహ‌నానికి యాక్సిడెంట్ అయ్యింద‌ని, దీంతో త‌మ ప్రాణాలు ద‌క్కాయ‌ని, ఒక వేళ కారుకు ప్ర‌మాదానికి గురి కాకుండా ఉంటే ఇన్స్ పెక్ట‌ర్ త‌మ‌ను ఇద్ద‌రినీ చంపేసి ఎక్క‌డో ప‌డేసి ఉండేవాడ‌ని ఆరోపించింది బాధిత మహిళ.

 

Exit mobile version